- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naga Vamsi: అజ్ఞాతంలోకి నాగవంశీ.. షాకింగ్ పోస్ట్‌తో ఎక్స్‌లో దర్శనమిచ్చిన నిర్మాత
ప్రముఖ నిర్మాత నాగవంశీ రీసెంట్‌గా ‘వార్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దిశ, సినిమా: ప్రముఖ నిర్మాత నాగవంశీ రీసెంట్‌గా ‘వార్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జెర్సీ, మ్యాడ్, మ్యాడ్-2, లక్కీ భాస్కర్, సార్’ లాంటి సినిమాలు నిర్మించి హిట్స్ అందుకు నిర్మాత నాగవంశీ.. తాజాగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన ‘వార్-2’ సినిమా తెలుగు రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా తనదైన స్ట్రైల్లో మాట్లాడి మూవీపై హైప్ పెంచాడు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. బాక్సాఫీష్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే.. ఈ సినిమా రైట్స్‌ను నాగవంశీ దాదాపు రూ. 100 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుండగా.. ఈ డిజాస్టర్‌తో ఎటు కనిపించకుండా పోయాడంటూ నెట్టింట వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. తనకున్న ఇళ్లు అమ్మేసుకుని దుబాయ్ పారిపోయాడంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పలు పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అలాగే.. ఆయన నెక్ట్స్ నిర్మిస్తున్న రవితేజ మాస్ జాతర చిత్రాన్ని కూడా ఇప్పట్లో విడుదల చేయరంటూ పలు రూమర్స్ వచ్చాయి. ఇలాంటి క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రత్యక్షమయ్యాడు నాగవంశీ.
తన ఎక్స్ అకౌంట్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ఏంటి నన్ను చాలా మిస్ అవుతునట్టు ఉన్నారు.. వంశీ అది, వంశీ ఇది అని గ్రిప్పింగ్ కథనాలతో ఫుల్ హడావిడి నడుస్తుంది.. పర్లేదు, ఎక్స్‌లో మంచి రైటర్స్ ఉన్నారు. మిమ్మల్నందరినీ నిరుత్సాహపరిచినందుకు క్షమించండి, కానీ ఇంకా ఆ సమయం రాలేదు.. కనీసం ఇంకో 10-15 సంవత్సరాలు ఉంది. సినిమా థియేటర్లలో... సినిమా కోసం, ఎల్లప్పుడూ! మా తదుపరి విహారయాత్ర మాస్ జాతరతో మీ అందరినీ కలుస్తాం.. అతి త్వరలోనే’ అంటూ ట్వీట్ పెట్టాడు. దీంతో.. వార్ 2 పరాజయంతో కలత చెంది నిర్మాత నాగ వంశీ దుబాయ్ పారిపోయాడు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయింది. లింక్






