బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్.. సూర్య సినిమాపై హైప్ పెంచేసిన నిర్మాత

by Chukka Sudharani |

అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘లెనిన్’ జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్.. సూర్య సినిమాపై హైప్ పెంచేసిన నిర్మాత
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘లెనిన్’ జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత నాగవంశీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నేను ఇప్పటికే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చూశాను. ఇది 200% బ్లాక్‌బస్టర్ చిత్రం. ఇది అందరి భావోద్వేగాలను తాకేలా ఉండే, హృదయానికి హత్తుకునే కుటుంబ కథా చిత్రం. భారీ విడుదలకు సిద్ధంగా ఉండండి’ అంటూ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాడు. కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యంగ్ బ్యూటీ మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో వచ్చేందుకు సిద్ధం అవుతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story