WAR 2 ఫ్లాప్ పై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

by Naga Rani Yarlagadda |

ఒకానొకప్పుడు వరుస ఓటములతో ఉక్కిరి బిక్కిరి అయిన జూనియర్ ఎన్టీఆర్..

WAR 2 ఫ్లాప్ పై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకానొకప్పుడు వరుస ఓటములతో ఉక్కిరి బిక్కిరి అయిన జూనియర్ ఎన్టీఆర్.. టెంపర్ సినిమాతో మళ్లీ సక్సెస్ బాటపట్టారు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటారు. గతేడాది రిలీజైన దేవర మిక్స్డ్ టాక్ సంపాదించినా.. భారీ వసూళ్లు సాధించింది. ఇలా వరుసగా హిట్స్ తో దూసుకెళ్తున్న తారక్ కు వార్ 2 సినిమా బ్రేకులు వేసింది. బాక్సాఫీస్ వద్ద ఊహించిన రిజల్ట్ కనిపించలేదు. డిజాస్టర్ టాక్ తో సినిమా కలెక్షన్లు పడిపోయాయి. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను తెలుగులో.. ప్రొడ్యూసర్ నాగవంశీ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.

సుమారు రూ.80 కోట్లకు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోవడంతో.. నాగవంశీకి కోలుకోలేని దెబ్బ తగిలిందంటూ వార్తలొచ్చాయి. తాజాగా ఈ రూమర్లపై నాగవంశీ స్పందించి.. వార్ 2 నష్టాలపై క్లారిటీ ఇచ్చారు. వార్ 2ను 68 కోట్లకు కొనగా.. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో.. ఒప్పందం ప్రకారం యష్ రాజ్ ఫిలిమ్స్ వారు తమకు తాముగానే ముందుకొచ్చి రూ.18 కోట్లు వెనక్కిచ్చినట్లు తెలిపారు. ఇక సినిమా రూ.35-40 కోట్ల వరకూ వసూళ్లు చేసిందన్నారు. ఫలితంగా తనకు కలిగిన నష్టం.. రూ.10-15 కోట్ల మధ్య మాత్రమే ఉన్నట్లు వివరించారు.

Next Story