- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naga Vamsi: మ్యాడ్ స్క్వేర్ టికెట్ ధరలు తగ్గింపు.. ఓ వైపు గుడ్‌న్యూస్ ప్రకటిస్తూనే ఫైర్ అయిన నిర్మాత
మార్చి 28 వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ మ్యాడ్ స్వ్కేర్ (Mad Square)జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: మార్చి 28 వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ మ్యాడ్ స్వ్కేర్ (Mad Square)జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. గతంలో విడుదలైన మ్యాడ్‌కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంలోని లవ్ స్టోరీ, కామెడీ సన్నివేశాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రజెంట్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. యూత్ థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. మొత్తానికి ఆడియన్స్ నుంచైతే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది.
కల్యాణ్ శంకర్ (Kalyan Shankar) తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), నార్నే నితిన్ (Narne Nithin), రామ్ నితిన్ (Ram Nithin) ముఖ్య పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. జనాలు థియేటర్లలో పగలబడి నవ్వుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో (Bheem's Cicerolio) సంగీతాన్ని సమకూర్చారు. ఇకపోతే తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన మూవీ టీమ్ ఓ గుడ్‌న్యూస్ ప్రకటించింది.
ఈ సందర్భగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. పెంచిన టికెట్ రేట్లు సాధారణ స్థాయికి తీసుకువాచ్చామని వెల్లడించారు. అలాగే రివ్యూస్ గురించి మాట్లాడారు. మూవీ భారీ విజయం సాధించినప్పుడు.. ఎందుకు సపోర్ట్ చేయరని, ప్రోత్సహించరని అన్నారు. కంటెంట్ లేకపోయినా హిట్ కావడానికి ఈ మూవీ ఏం బాహుబలి , పుష్ప 2, కేజీఎఫ్ 2 కాదని నిర్మాత అన్నారు.
కంటెంట్ బాగుంటే మూవీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని పేర్కొన్నారు. అలాగే యూట్యూబ్ వారికి కంటెంట్ దొరకాలంటే నేను ఇంటర్వ్యూలు, యాడ్స్ ఇవ్వాల్సిందేనని, ప్రొడ్యూసర్ నాగవంశీ కాస్త ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ నిర్మాత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






