- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Spirit: మరో రెండు మూడు నెలల్లో ‘స్పిరిట్’.. ప్రభాస్ సినిమాపై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ (Spirit) ఒకటి. సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూస్తామా అంటూ సినీ ప్రియులతో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా.. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ‘స్పిరిట్’ నిర్మాత ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుంచి స్పిరిట్‌కు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా, ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తున్నట్లు టాక్. అంతే కాకుండా.. ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘కల్కి’లో నటించగా.. సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. ఇక ‘కల్కి-2’లో కూడా ఈ పాత్రలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ‘స్పిరిట్’ కోసం ప్రభాస్, దీపికా పదుకొణె జతకట్టనున్నారనే న్యూస్ నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






