- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘ది రాజాసాబ్’ (The Rajasaab).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘ది రాజాసాబ్’ (The Rajasaab). రొమాంటిక్ అండ్ హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ మూవీలో విలన్‌గా సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుకుంటున్న ‘ది రాజాసాబ్’ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక గత కొద్ది కాలంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మేకర్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.
ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ‘‘పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారి బ్యానర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్‌గా ‘ది రాజాసాబ్’ను రూపొందిస్తున్నారు. మారుతి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మరో రెండు వారాల్లో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రాబోతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ సినిమాతో పాటు ప్రభాస్ కల్కి-2, సలార్-2, ఫౌజీ, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్ట్స్ చేయనున్నారు. అన్ని షూటింగ్ దశలోనే ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా? అని ఎదురుచూస్తున్నారు.






