Dil Raju Brother: ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడిన నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ .. వైరల్ అవుతున్న వీడియో

by Prasanna |   ( Updated:2025-01-17 11:26:01.0  )
Dil Raju Brother: ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడిన నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ .. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) హీరోగా తెరకెక్కిన సినిమా " సంక్రాంతికి వస్తున్నాం " ( Sankranthiki Vasthunam ). ఈ మూవీ సంక్రాంతి కానుకగా మన ముందుకొచ్చింది. రీలీజ్ అయిన రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఈ మూవీ రూ. 106 కోట్లు వసూలు చేసింది. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీకి దిల్ రాజు, శిరీష్ ( Shirish ) నిర్మాతలు. ఈ నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటికీ ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే, ఇంత వరకు శిరీష్ మీడియా ముందు మాట్లాడలేదు.. అయితే, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదటి సారి మాట్లాడాడు. శిరీష్ మాట్లాడుతూ " మొదటి సారి నిజామాబాద్ లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎలాంటి స్పీచ్ మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చిన వారికీ పేరు పేరునా థాంక్స్ చెప్పాలి .. అది నా కృతజ్ఞత. వెంకటేష్, మా హీరోయిన్స్ మీనాక్షి, ఐశ్వర్య కి , ముఖ్యంగా మా డైరెక్టర్ అనిల్ రావిపూడికి , సినిమాకి పని చేసిన అందరికీ థాంక్స్" అంటూ ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.

(Video Credits to Dil Raju YouTube Channel)

Advertisement

Next Story