ప్రేక్షకులు వస్తేనే సినిమా సక్సెస్.. వాళ్లు వచ్చేలా ఉండాలి: దిల్ రాజు

by Chukka Sudharani |

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’.

ప్రేక్షకులు వస్తేనే సినిమా సక్సెస్.. వాళ్లు వచ్చేలా ఉండాలి: దిల్ రాజు
X

దిశ, సినిమా: విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈనెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘కల్యాణ్ ప్రాప్తిరస్తు అని వినేవాళ్లం, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని వింటున్నాం. లివ్ ఇన్ రిలేషన్, పెళ్లి సులువు అయ్యింది. కానీ పిల్లలు పుట్టడమే సమస్యగా మారుతోంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టుకున్నారు. హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ, ప్రొడ్యూసర్స్ మధుర శ్రీధర్, హరి ప్రసాద్, డైరెక్టర్ సంజీవ్ రెడ్డికి ఆల్ ది బెస్ట్. ఇందాక ఈ టీమ్ తో చెబుతున్నా, సినిమా తీయడం, ట్రైలర్ లాంచ్ చేసుకోవడం కంటే మార్నింగ్ షోస్‌కు ప్రేక్షకుల్ని రప్పించి సినిమా సక్సెస్ అనిపించుకోవడం గొప్ప విషయం. దాని కోసం ఈ రోజు నుంచి మీరు సినిమా చేసినదానికంటే ఎక్కువ శ్రమ పెట్టాలి. మీ మూవీ కంటెంట్‌తో ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేసి వాళ్లు థియేటర్స్‌కు వచ్చాక ఎంగేజ్ చేస్తే, మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తే థియేటర్స్‌లో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ప్రేక్షకులకు, మీడియాకు నచ్చి మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అందిస్తున్నా’ అని చెప్పుకొచారు.

Next Story