Dil Raju: మీరు అమ్ముకునేది తక్కువకే.. కానీ నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు.. పైరసీపై ప్రముఖ ప్రొడ్యూసర్ కామెంట్స్

by Chukka Sudharani |

నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’.

Dil Raju: మీరు అమ్ముకునేది తక్కువకే.. కానీ నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు.. పైరసీపై ప్రముఖ ప్రొడ్యూసర్ కామెంట్స్
X

దిశ, సినిమా: నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘తమ్ముడు’ సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సినిమా పైరసీ విషయంపై మాట్లాడారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.

‘పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోంది. థియేటర్స్‌లో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాలర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్ కానీ, నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టం అవుతాయని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘పైరసీ అయినా, ఈ నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఒక్కో స్టెప్‌తో ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్‌కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది ప్రొడ్యూసర్ కే. నేను వీటిపైన గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చింది అంటారు. నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్ బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్, ఆయన రేంజ్‌కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్‌గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్‌తోనే అలా చెప్పాను. అయితే దాన్ని కూడా నెగిటివ్‌గా చూడొద్దు’ అని తెలిపారు.

Next Story