- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గేమ్ చేంజర్ సినిమా పైరసీపై నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో కొందరు ఎంతకు దిగజారిపోతున్నారో వారు చేస్తున్న పనులు చూస్తుంటే తెలుస్తుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సినిమా ఇండస్ట్రీలో కొందరు ఎంతకు దిగజారిపోతున్నారో వారు చేస్తున్న పనులు చూస్తుంటే తెలుస్తుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు (Producer Dil Raju) అన్నారు. ఇటీవల థియేటర్ల విషయంలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. తెలంగాణలో 370 థియేటర్లు ఉంటే.. వాటిలో 30 థియేటర్లు తనవేనన్నారు. గేమ్ చేంజర్ సినిమా రిలీజైన రోజే పైరసీ (Game Changer Piracy) చేశారని, ఇది మరో నిర్మాత చేసినా ఒక నిర్మాతకు ఎంత నష్టం కలిగించే పనో కనీసం ఆలోచన లేకుండా చేశారని వాపోయారు. ఒక సినిమాను నిర్మాతే పైరసీ చేయడం అంటే.. మన ఇంట్లో మనిషిని మనం చంపుకున్నట్లేనని అభిప్రాయపడ్డారు. ఇక థియేటర్ల విషయానికొస్తే.. తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల మీటింగ్ తో అసలు టాపిక్ మొదలైందన్నారు. ఇది ఆ జిల్లా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల విషయం మాత్రమేనని దిల్ రాజు స్పష్టం చేశారు. థియేటర్లలో 90 శాతం సినిమాలు పర్సంటేజ్ విధానంలో ప్రదర్శిస్తున్నారని, రెంట్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ప్రదర్శిస్తున్న డిస్ట్రిబ్యూటర్లకే సమస్య ఉందని తెలిపారు.
థియేటర్లో రిలీజ్ చేసే ఏ సినిమాకైనా మొదటివారం రెంట్ ఇస్తామని, రెండోవారం నుంచి పర్సంటేజ్ ఇస్తామని చెప్పుకొచ్చారు. పర్సంటేజి విధానం తెలంగాణకు వచ్చినపుడు ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ఇలా అంటున్నారని, తెలంగాణలో థియేటర్లు కూడా మూత పడుతున్నాయని 270 థియేటర్ల ఎగ్జిబిటర్లు అడిగారని, వారితో తమ అనుబంధం 28 ఏళ్లుగా ఉందన్నారు. గతేడాది ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఎగ్జిబిటర్ల సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తామని తాను చెప్పిన మాట గురించి ఈస్ట్ ఎగ్జిబిటర్లు అడిగినట్లు శిరీష్ తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.
తాను హాలిడేకు వెళ్లి వచ్చేసరికి మే18న ఎగ్జిబిటర్లు మీటింగ్ పెట్టుకున్నారని, చివరి పావుగంట మాత్రమే మీటింగ్ కు వెళ్లానని చెప్పారు. వారు అక్కడ సినిమాలపై పర్సంటేజిలపై తమకున్న డిమాండ్లను చెప్పారని, వారి సమస్యల్ని పరిష్కరించేందుకే తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంతలోనే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ (Theatres Close) అనే వార్తలొచ్చాయని అసహనం వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పూర్తిస్థాయి సమావేశం జరగకుండానే ఇలాంటి న్యూస్ ను వ్యాప్తి చేయడంపై ఆవేదన చెందారు. మే 24న ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించి.. థియేటర్ల మూసివేత వద్దని తీర్మానించామన్నారు. ఆఖరికి పవన్ సినిమాపై కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందన్నారని, ఆయన సినిమాను ఆపే ధైర్యం ఎవ్వరూ చేయరన్నారు. మీడియా వల్ల థియేటర్ల విషయంలో పవన్కల్యాణ్ కు విషయం మిస్ కమ్యూనికేట్ అయిందని, ఈ విషయంలో ఆయన హర్ట్ అయ్యారని దిల్ రాజు పేర్కొన్నారు. మే నెలలో రిలీజవ్వాల్సిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని చెప్పారు. ఈ నెల 30న జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ విషయాలు, మిగతా సమస్యలపై చర్చిస్తామని తెలిపారు.






