- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా బ్యాడ్ షేప్‌లో ఉంది.. నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితిపై నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్టులు రోహన్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సమ్మర్ హాలిడేస్’. శ్రీకార్ నయన్ జి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్స్ అండ్ వి.జి.బి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని సంయుక్తంగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. బిజీ లైఫ్‌లో పడి మర్చిపోతున్న మన బాల్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ టీజర్ ప్రస్తుతం వైరల్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడతూ.. ‘నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఇండస్ట్రీ చాలా బ్యాడ్ షేప్‌లో ఉంది. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా మంది భయపడతారేమో. నేను చాలా ధైర్యంగా చెబుతాను. ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకురావడమే మనందరికి బిగ్ చాలెంజ్. దానికి మీరు ఇలాంటి మంచి సినిమాలు తీసి ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకొస్తే చాలు. వాళ్లు థియేటర్స్‌కు వస్తే ఆటోమేటిక్‌గా మంచి సినిమాలు నిలబడతాయి. చిన్న సినిమాలు తీసి సక్సెస్ అయిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. బేబీ రాజేష్ చిన్న సినిమాగా తీసి ఎంత పెద్ద సక్సెస్ చేశాడు. అలాగే పవన్, సాయి చిన్న సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. ఇక సాయి అయితే ‘లిటిల్ హార్ట్స్ సక్సెస్‌తో కొత్త డైరెక్టర్స్‌కు పెద్ద ఇన్పిరేషన్‌గా అయిపోయాడు. ఇలాంటి వాళ్లు ఇంకెందరో రావాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.






