Majaka: భైరవకోన కంటే బెటర్ సినిమా అవుతుంది.. సందీప్ సినిమాపై నిర్మాత కామెంట్స్

by Chukka Sudharani |

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ (Sandeep Kishan) త్వరలో తన 30వ సినిమా ‘మజాకా’ (Majaka)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Majaka: భైరవకోన కంటే బెటర్ సినిమా అవుతుంది.. సందీప్ సినిమాపై నిర్మాత కామెంట్స్
X

దిశ, సినిమా: పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ (Sandeep Kishan) త్వరలో తన 30వ సినిమా ‘మజాకా’ (Majaka)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన (Trinatha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైన్‌లో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ‘మన్మధుడు’ ఫేమ్ అన్షు, సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్‌టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించాడు నిర్మాత రాజేష్ దండా (Rajesh Danda).

‘‘మజాకా’ మంచి ఎంటర్‌టైనర్ అండ్ ఫ్యామిలీ సినిమా. డైరెక్టర్ త్రినాధ్, రైటర్ ప్రసన్న స్టయిల్‌లో ఉండే మాస్ ఎంటర్‌టైనర్. టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘సొమ్మసిల్లి పోతున్నవే’ సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. ఖచ్చితంగా ఇది చాలా మంచి సినిమా అవుతుంది. మంచి ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషన్ ఉన్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. అంతే కాకుండా ఇంటర్వెల్‌కి మంచి ట్విస్ట్ ఉంటుంది. అది సెకండ్ హాఫ్‌ని ఎలా లీడ్ చేస్తోందో చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. సందీప్, రావు రమేష్ సీన్స్, సందీప్ రీతు లవ్ స్టొరీ, అలాగే రావు రమేష్ అన్షు ట్రాక్ కూడా చాలా బావుంటుంది. సందీప్‌కి భైరవకోన కంటే బెటర్ సినిమా అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

Next Story