Allu Arjun : అల్లు అర్జున్ వేసుకున్న బ్రహ్మీ టీ షర్ట్‌పై ట్రోల్స్.. ఇప్పటికే ఉన్న పొగ చాలంటూ నిర్మాత సంచలన ట్వీట్

by Chukka Sudharani |

ముంబై (Mumbai) వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్’ కోసం రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముంబైకి బయల్దేరిన విషయం తెలిసిందే.

Allu Arjun : అల్లు అర్జున్ వేసుకున్న బ్రహ్మీ టీ షర్ట్‌పై ట్రోల్స్.. ఇప్పటికే ఉన్న పొగ చాలంటూ నిర్మాత సంచలన ట్వీట్
X

దిశ, సినిమా: ముంబై (Mumbai) వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్’ కోసం రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముంబైకి బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఎయిర్ పోర్ట్‌లో ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అనే మీమ్ రాసి ఉన్న బ్రహ్మానందం టీషర్ట్‌తో కనిపించగా.. అది కాస్త సోషల్ మీడియా(Social media)లో ట్రెండింగ్‌గా మారింది. అయితే.. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ బైకులు, కార్ల వెనుక అంటించి రాష్ట్రవ్యాప్తంగా ట్రెండ్‌గా నిలిచారు. ఇప్పుడు అల్లు అర్జున్ ధరించిన టీ షర్ట్‌(T-shirt)కు ఆ విషయాన్ని కనెక్ట్ చేస్తూ.. ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’కు కౌంటర్‌ ఇచ్చాడుగా అంటూ నెట్టింట కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేవిప్రియా@sairaaj44 అనే ట్విట్టర్ అకౌంట్‌లో ‘సోషల్ మీడియా అటెన్షన్ ఎలా తెచ్చుకోవాలో.. అల్లుఅర్జున్‌కు బాగా.. బాగా తెలుసు.. మీరేమంటారు కామెంట్ చేయండి’అంటూ ఓ పోస్ట్ వచ్చింది.

ఈ పోస్ట్‌పై స్పందించిన నిర్మాత బన్నీ వాసు.. దేవిప్రియా@sairaaj44 పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘Dear @sairaaj44 గారు.. ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్..? ఆయన వేసుకున్న టీ షర్టు మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా..? అక్కడ తన అభిమాన హాస్యనటుడు పై బన్నీ గారి ప్రేమ మీకు కనిపించలేదా..? మీ దృష్టిలో బ్రహ్మానందం గారిని బన్నీ గారు హైలైట్ చేసిన పాజిటివ్ కోణం మీకు కనబడలేదు కానీ అందులో ఇలాంటి కోణం ఒకటి వెతికారు. వీలైతే గొడవలు ఆపుదాం.. మంచి విషయాలను పాజిటివ్ గా చెబుదాం. నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి గారు అంటూ జాతీయ వేదికపై నిన్ననే బన్నీ గారు చాలా బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్‌లో రాలేదనుకుంటా.. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటిని హైలెట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఇటువంటివి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు సార్..?’ అంటూ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Next Story