- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Producer Bunny Vasu : షూటింగ్ చేసిన చేయకున్న కూడా వాళ్లకు డబ్బు ఇవ్వాలి.. నిర్మాత బన్ని వాసు షాకింగ్ కామెంట్స్
నటి మధు శాలిని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్యా కుమారి’.

దిశ, సినిమా: నటి మధు శాలిని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్యా కుమారి’. ఆర్గానిక్ ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గీత్ సైని, శ్రీ చరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ గణేష్ చతుర్థి స్పెషల్‌గా ఆగస్టు 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఇందులో నిర్మాత బన్ని వాసు (Producer Bunny Vasu) AA22xA6 షూటింగ్ గురించి మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు.
‘సినీ కార్మికులు అందరు ఒక నిర్ణయంపై ఉంటారు. కాబట్టి ఇండియాలో ఎక్కడ సమ్మె జరుగుతున్నా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఆ విధంగా ముంబైలో AA22xA6 సినిమా షూట్ జరుగుతున్నప్పుడు కూడా కొంత ఇబ్బంది పడ్డాము. అయితే.. మేము రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే షూటింగ్ ఒక్క రోజుకు కోట్ల రుపాయల ఖర్చుతో కూడుకున్న సినిమా అది. అలాగే ఎక్కువ మంది ఫారన్ టెక్నీషీయన్స్ వచ్చి ఇండియాలో చేస్తున్న సినిమా కాబట్టి.. వాళ్లు ముందే వచ్చి ఉంటారు. సమ్మెల కారణంగా వాళ్లను కాళీగా ఉంచలేము. అంతే కాకుండా వాళ్లతో డీల్ ఎలా ఉంటుంది అంటే.. షూటింగ్ చేసిన చేయకున్న కూడా వాళ్లకు డబ్బు ఇవ్వాలి. అలాంటి విషయంలో బాగా ఇబ్బంది పడ్డాము’ అని తెలిపారు బన్ని వాసు.






