- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dil Raju: బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత.. వారికోసమే ‘దిల్ రాజు డ్రీమ్స్’ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు(Dil Raju) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు(Dil Raju) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన మొదటి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న దిల్ రాజు టాలెంట్ కు కేరాఫ్ అడ్రస్. టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆదరించే వ్యక్తిగా ఎంతోమంది హీరోలను, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన లాభాలు పొందుతూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా, దిల్ రాజు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్ ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కొత్త టాలెంట్ ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు దిల్ రాజు "దిల్ రాజు డ్రీమ్స్"(Dil Raju Dreams) అనే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఫ్రెష్ కంటెంట్‌ను, టాలెంట్ ను ప్రోత్సహించే దిల్ రాజు ఇప్పుడు "దిల్ రాజు డ్రీమ్స్" ప్లాట్‌ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ నెల నుంచి ఆయన సిద్ధం చేసిన ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది.
జూన్‌లో ఈ పోర్టల్ సిద్ధమైన తర్వాత, "దిల్ రాజు డ్రీమ్స్" ద్వారా యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందం దృష్టికి తీసుకెళ్లవచ్చు. తమ టాలెంట్ నిరూపించుకోవాలనుకునేవారు ఎంతో మంది సరైన ప్లాట్ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. టాలెంట్ ఉన్నా సినీ పరిశ్రమలో కాంటాక్ట్స్ లేక, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ముందుకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. టాలెంట్ ఉన్నవారు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దిల్ రాజు స్థాపించిందే ఈ దిల్ రాజు డ్రీమ్స్.. ఇక ఆలస్యం ఎందుకు సినిమాల్లో నటించాలనుకునే వారు అప్లై చేసుకోండి.






