- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AM Rathnam: హరిహర వీరమల్లు విడుదల తేదీలో మార్పు లేదు (వీడియో)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie).

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie). 90శాతానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని వచ్చే మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా.. ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే.. ‘పవన్ కల్యాణ్‌కు సంబంధించిన కొన్ని సీన్ల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని.. ఆయన మరో 10 రోజులు డేట్స్ ఇస్తే కానీ సినిమా అనుకున్న టైమ్‌కు రాదని’ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా.. సినిమా విడుదలపై, ఆ వార్తలపై నిర్మాత ఏఎమ్ రత్నం(AM Rathnam) క్లారిటీ ఇచ్చారు. ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఎవరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తాం. పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పెండింగ్ షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాం’ అని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇక ఇటీవలే ఈ సినిమా సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టినాదిరో' అప్డేట్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్‌ను కూడా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాటను దాదాపు ఐదు రోజుల పాటు ఒక పెద్ద ప్యాలెస్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) టేకప్ చేశాడు. కానీ.. అప్పుడు ఏపీలో ఎలక్షన్స్ కారణంగా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దాంతో నిర్మాత ఏంఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Tiger Sequence🐯💥
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) February 18, 2025
No More Postponing March 28th On Big Screens #HariHaraVeeraMallu 🦅 pic.twitter.com/4DFWmQge9f






