- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఈషా' చూశాక రియలిస్టిక్ ఫీల్‌తో థియేటర్స్ నుంచి బయటకు వస్తారు : నిర్మాత
ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన 'కథ' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ మన్నె, కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఈషా'.

దిశ, సినిమా : ‘ఈషా’ సినిమా చూశాక ప్రేక్షకులు రియలిస్టిక్ ఫీల్‌తో థియేటర్స్ నుంచి బయటకు వస్తారని తెలిపారు ఈ చిత్ర నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని.. ఆడియన్స్‌కు ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుందన్నారు. ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన ‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ మన్నె తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్‌ను బన్నీవాస్, వంశీ నందిపాటి ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని డిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్ రాజ్‌తోపాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నఈ మూవీని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






