Priyanka Mohan: బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్ షో చేసిన పవన్ బ్యూటీ

by Pulgam srinivas |

ప్రియాంక అరుల్ మోహన్ చంకీలు పొదిగిన బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సు ధరించి, తన కురులు ప్రత్యేకంగా హైలైట్ అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Priyanka Mohan: బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్ షో చేసిన పవన్ బ్యూటీ
X


దిశ, వెబ్ డెస్క్: ప్రియాంక అరుల్ మోహన్ పేరును ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు అనేక తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ చిన్నది నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.




ఆ తర్వాత ఈ హీరోయిన్ పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ మంచి విజయాలు మాత్రం దక్కలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీ వైపు ఆసక్తి చూపిన ఈమెకు అక్కడ మంచి అవకాశాలు, విజయాలు దక్కాయి. కొంతకాలం క్రితం ఈ నటి, పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ చిత్రంలో హీరోయిన్గా నటించింది.




ఈ మూవీ ద్వారా ప్రియాంకకి భారీ విజయం దక్కడం మాత్రమే కాకుండా అద్భుతమైన క్రేజ్ కూడా లభించింది. తాజాగా ఈ ఓజీ బ్యూటీ 'మేడ్ ఇన్ కొరియా' అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది.




సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న ఈమె, తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్పుడప్పుడు హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారులో హీట్ పెంచుతోంది.



తాజాగా ఈ నటి చంకీలు పొదిగిన బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సు ధరించి, తన కురులు ప్రత్యేకంగా హైలైట్ అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఈమె మోడ్రన్ లుక్‌లో చాలా అందంగా కనిపించడంతో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలకు అనేకమంది లవ్ సింబల్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.

Photos Courtesy: Instagram

Next Story