మరోసారి క్లాస్ లుక్‌లో కనిపిస్తున్న ప్రియాంక మోహన్

by Pulgam srinivas |

పింక్ చీరలో క్యూట్ లుక్‌తో ఆకట్టుకున్న ప్రియాంక అరుల్ మోహన్

మరోసారి క్లాస్ లుక్‌లో కనిపిస్తున్న ప్రియాంక మోహన్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అందాల భామలు ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో చాలామంది తొలి సినిమాకే తమ గ్లామర్‌ను ప్రదర్శిస్తూ కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం హద్దులు మీరకుండా, క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంటారు.



అలాంటి వారిలో యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒకరు. ఈమె ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఎప్పుడూ హద్దులు మీరి గ్లామర్ ప్రదర్శన చేయలేదు. క్లాస్ మరియు డీసెంట్ పాత్రల ద్వారానే ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇదే కారణంగా ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది.




సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో కూడా ఈ నటి చురుకుగా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.




ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా స్కిన్ షోకు దూరంగా ఉండే ఫోటోలనే పోస్ట్ చేస్తూ తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ కలిగిన లైట్ పింక్ కలర్ చీరను ధరించి, అందుకు సరిపోయే బ్లౌజ్‌తో క్లాస్ అండ్ డీసెంట్ లుక్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.




ఈ ఫోటోలలో ఆమె తన జుట్టును అందంగా వెనక్కు సర్దుకొని, చెవులకు చిన్న ఇయర్ రింగ్స్ ధరించి, చిరునవ్వుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫోటోలలో ఆమె క్యూట్ లుక్ అభిమానులను ఆకట్టుకోవడంతో, ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story