మారి సెల్వరాజ్ నెక్ట్స్ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్.. హీరో ఎవరంటే?

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘కర్ణన్’.

మారి సెల్వరాజ్ నెక్ట్స్ ప్రాజెక్టులో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్.. హీరో ఎవరంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ ధనుష్, దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘కర్ణన్’. తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2021లో విడుదలై కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ధనుష్‌తో మరోసారి మారి సెల్వరాజ్ చేతులు కలిపాడు. ఈయనతో కలిసి ధనుష్ తన 56 చిత్రాన్ని చేయబోతున్నాడు. వేల్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ సంస్థ నిర్మించబోతున్న ఈ చిత్రంపై ఎప్పుడో అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఈ సినిమా ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన డైరెక్టర్ మారి.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు టాక్.

ఈ మేరకు యంగ్ హీరో కతిర్‌తో చేతులు కలిపారు. అయితే.. వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం 2024 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వాజై’కు సీక్వెల్‌గా రాబోతున్నట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా సమాచారం మేరకు ఇది పూర్తిగా కొత్త కథ అని టాక్. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం ఇళయరాజా మొదటిసారిగా మారి సెల్వరాజ్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుండగా.. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు టాక్.

Next Story