Priyanka Jain: ఆకట్టుకుంటోన్న బుల్లితెర కపుల్ హోలీ ఫొటో షూట్.. క్యూట్ కపుల్ అంటోన్న ఫ్యాన్స్!

by Kodari Anjali |

మౌనరాగం (Maunaragaṁ) సీరియల్‌తో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు ప్రియాంక జైన్ (Priyanka Jain). ఈ బ్యూటీ బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Priyanka Jain: ఆకట్టుకుంటోన్న బుల్లితెర కపుల్ హోలీ ఫొటో షూట్.. క్యూట్ కపుల్ అంటోన్న ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: మౌనరాగం (Maunaragaṁ) సీరియల్‌తో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు ప్రియాంక జైన్ (Priyanka Jain). ఈ బ్యూటీ బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అందం, అభినయం, నటనతో బుల్లితెర ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్‌ సీజన్-7 కు కంటెస్టెంట్‌గా హౌస్‌లోకెళ్లి తనదైన శైలిలో ఆట ఆడి జనాల్ని మెప్పించింది.

దీంతో ప్రియాంక జైన్ క్రేజ్ మరింత పెరిగింది. హౌస్‌లో అద్భుతంగా గేమ్ ఆడి.. టాప్ 5 కు చేరుకుంది. అమర్‌దీప్ (Amardeep) అండ్ శోభాశెట్టి(Shobha Shetty)తో స్నేహంగా ఉంటూ చక్కగా ఆట ఆడింది. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో కూడా దర్శనమిస్తుంది. యూట్యూబ్‌లో పలు వీడియోలు చేస్తూ తన సత్తా చాటుతుంది. పలు టీవీ షోల్లో కూడా తెగ సందడి చేస్తూ అభమానుల్ని అలరిస్తుంటుంది.

హౌస్‌లో ఉన్నప్పుడు ప్రియాంక జైన్ ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పుకొచ్చింది. ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నానని చెప్పి పెద్ద బాంబ్ పేల్చింది. అంతేకాకుండా అతడు ఫ్యామిలీ వీక్‌లో భాగంగా హౌస్‌లోకి వచ్చాడు. హౌస్‌లోకి రాగానే ప్రియాంక జైన్ హగ్‌లు, ముద్దులతో ముంచెత్తింది.

ఈ క్రమంలోనే పెళ్లి ఎప్పుడూ చేసుకుందామంటూ అడిగి రొమాంటిక్ కపుల్‌గా పేరు సంపాదించుకుంది. మరీ ఈ అబ్బాయి ఎవరో కాదు.. మౌనరాగం సీరియల్‌లో హీరోగా నటించిన నటుడే శివ్ కుమార్. వీరిద్దరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం శివ్ కుమార్ అండ్ ప్రియాంక జైన్ కలిసి దేవాలయాలకు వెళ్లడం, గోవా (Goa), ఢిల్లీ (Delhi), బెంగళూరు (Bangalore) వంటి ప్రాంతాలకు వెళ్లి జాలిగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇప్పుడు సీరియల్స్ మానేసి.. యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నారు. ప్రియాంక ఓ షోలో భాగంగా శివ్ ను వివాహం చేసుకుంది. ఈ కార్యక్రమానికి తమ కుటుంబీకులు కూడా హారజవ్వడం గమనార్హం. ఇకపోతే నేడు హోలీ సందర్భంగా వీరిద్దరు అదిరిపోయే ఫొటో షూట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Next Story