Oscar Awards 2025: 2025 ఆస్కార్‌ బరిలో ప్రియాంక చోప్రా సినిమా.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ (ట్వీట్)

by Mallepaka Hamsa |

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు అంతా సిద్ధమైంది. ఈ ఈవెంట్ మార్చి 2న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌(Dolby Theater)లో గ్రాండ్‌గా జరగనుంది.

Oscar Awards 2025: 2025 ఆస్కార్‌ బరిలో ప్రియాంక చోప్రా సినిమా.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ (ట్వీట్)
X

దిశ, సినిమా: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు అంతా సిద్ధమైంది. ఈ ఈవెంట్ మార్చి 2న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌(Dolby Theater)లో గ్రాండ్‌గా జరగనుంది. అయితే ఈ వేడుకలకు కమెడియన్ కోనన్ ఓ బ్రియన్(Conan O'Brien) హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఆస్కార్‌కు నామినేట్ అయిన సినిమాల లిస్ట్‌ను ప్రకటిస్తున్నారు అకాడమీ వారు. 2025 ఆస్కార్ బరిలో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra), గునీత్ మోంగా(Guneeth Monga) నిర్మించిన ‘అనూజ’(Anuja) చిత్రం కూడా ఉన్నట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది.

97వ అకాడమీ అవార్డుల నామినేషన్లలో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌ కేటగిరీ(best Live Action Short Film Category)లో ‘అనూజ’ నామినేట్ అయినట్లు గురువారం x ద్వారా వెల్లడించారు. అయితే బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి అర్హత సాధించిన 180 సినిమాల్లో.. కేవలం ఐదు చిత్రాలు మాత్రమే ట్రోఫీని కైవసం చేసుకునేందుకు పోటీ పడి అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఈ లిస్ట్‌లో ఏలియన్, ఐయామ్ నాట్ ఏ రోబోట్, ది లాస్ట్ రేంజర్, ఏ మ్యాన్ హూ వుడ్ నాట్ సైలెంట్‌తో పాటుగా ‘అనూజ’ కూడా నామినేట్ అయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రియాంక చోప్రా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, ఆస్కార్‌లో గునీత్‌కి ఇది మూడో నామినేషన్‌ అని సమాచారం. గతంలో ఆమె నిర్మించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఆస్కార్ బరిలో నిలిచి అవార్డులను గెలుచుకున్నాయి.

Next Story