- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Priyanka Chopra: ‘క్రిష్-4’ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న ప్రియాంక చోప్రా.. షాక్‌లో నిర్మాతలు!

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన చిత్రాల్లో ‘క్రిష్’ ఎంతలా ఆదర సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్స్ కూడా వచ్చి ఘన విజయాన్ని సాధించాయి. 2013లో వచ్చిన ‘క్రిష్-3’కి కొనసాగింపుగా రాబోతున్న మూవీ ‘క్రిష్-4’. అయితే ఈ సినిమా ఆయన స్వయం దర్శకత్వంలో రాబోతుండటం విశేషం. ఇక ఈ మూవీలో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు టాక్. ఇప్పటికే క్రిష్-4 స్టోరీ ఆమెకు చెప్పగా దానికి ఆమె ఒప్పుకుందట. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ అమ్మడు ‘క్రిష్-4’ కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం అడుగుతుండటంతో నిర్మాతలు షాక్ అవుతున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ కావడంతో అవి చూసిన వారు షాక్‌కు గురవుతున్నారు. కాగా, ఈ అమ్మడు ఈ సినిమాతో పాటు తెలుగులో సూపర్ స్టార్ సరసన ‘SSMB-29’ లో నటించబోతుంది. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దీంతో పాటు ప్రియాంక హిందీలో కూడా పలు ప్రాజెక్ట్స్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.