Rajamouli-Mahesh Babu: ‘SSMB 29’ సినిమాలో ప్రియాంక చోప్రా? హైప్ పెంచుతున్న పోస్ట్

by Hamsa |
Rajamouli-Mahesh Babu: ‘SSMB 29’ సినిమాలో ప్రియాంక చోప్రా? హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ ‘SSMB 29’. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. అయితే ఇది వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మూవీ కోసం గత కొద్ది రోజుల నుంచి మహేష్ బాబు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. అడవుల్లో పలు విద్యలు నేర్చుకుంటూ తెగ కష్ట పడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా కోసం మహేష్ బాబు పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలు పెంచుకుని సరికొత్త లుక్‌లోకి వచ్చేశారు.

అలాగే ఏ సినిమాలో చేయని విధంగా ఇందులో షర్ట్ తీసి పలు సీన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఈ మూవీ షూటింగ్ కోసం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఇటీవల ఓ పోస్ట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘SSMB 29’ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో మహేష్ బాబుకు జోడీగా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అంచనాలు పెంచుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా వావ్ సూపర్ జోడీ అని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed