ఆయనతో ఆ పని చేయడం నా కల.. నాని హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Bhoopathi Nagaiah |

కన్నడ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఆయనతో ఆ పని చేయడం నా కల.. నాని హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఓంధ్ కథే హెల్లా’(Ondh Kathe Hella) అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ (Gang leader) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ మూవీలో ఈ అమ్మడు తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత, శ్రీకారం(Sreekaram), సరిపోదా శనివారం(Saripoda Shanivaram) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక హీరో నాని(Nani) సరసన సరిపోదా శనివారం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అయితే ఆ సినిమా హిట్ అయినా ఈ బ్యూటీకి మాత్రం తెలుగులో ఆశించిన రేంజ్ లో అవకాశాలు రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతే కాకుండా తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ఓజీ (OG) సినిమా చేస్తోంది. అలాగే ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘ఓజీ మూవీ షూటింగ్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల. మొత్తానికి అది నెరవేరింది. ఈ మూవీలో మీరు కళ్యాణ్‌ని ఒక కొత్త తరహాలో చూస్తారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియాంక మోహన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఓజీ మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

Next Story