‘సాంప్రదాయ దుస్తుల్లో అందంగా కూర్చుని యువరాణిలా భావిస్తున్నాను’: టాలీవుడ్ హీరోయిన్

by Kodari Anjali |

హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘సాంప్రదాయ దుస్తుల్లో అందంగా కూర్చుని యువరాణిలా భావిస్తున్నాను’: టాలీవుడ్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఓంద్ కథే హెల్లా (Ond kathe hella) అనే కన్నడ సినిమాతో మొదటిసారిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీకి గిరీష్ జి దర్శకత్వం వహించారు. తర్వాత విక్రమ్ కుమార్ (Vikram Kumar) రూపొందించిన గ్యాంగ్ లీడర్‌ (Gang leader) సినిమాలో కీలక పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.

అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వం వహించిన శివకార్తికేయన్ (Sivakarthikeyan) ‘డాక్టర్’ (Doctor) మూవీలో నటించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద వంద కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రియాంక అరుల్ మోహన్ మొదటిసారిగా ఉత్తమ నటిగా అవార్డు కూడా సొంతం చేసుకుంది.

తర్వాత ఈమె సూర్య నటించిన దర్శకుడు పాండిరాజ్‌ (Pandiraj)తో కలిసి తన రెండవ తమిళ సినిమా 'ఎథర్క్కుం తునింధవన్' (Etherkkum Tunindhavan)లో ప్రధాన మహిళా పాత్రను పోషించింది. అనంతరం ప్రియాం, ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ (Captain Miller) అలాగే నాని (Nani)తో కలిసి సరిపోదా శనివారం (Saripoda sanivaram) చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.

వీటితో పాటుగా ఈ ముద్దుగుమ్మ శ్రీకారం, డాన్, టిక్ టాక్, కెప్టెన్ మిల్లర్, సోదరుడు, నిలవుకు ఎన్‌మెల్ ఎన్నడి కోబం వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఈ అమ్మడు ముఖ్య పాత్రలో నటించిన గ్యాంగ్ లీడర్ (Gang leader) చిత్రానికి ఉత్తమ మహిళగా ఈ మూవీ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌(South Indian International Movie Awards)కు నామినేట్ అయ్యింది. ఉత్తమ నటిగా డాక్టర్ చిత్రానికి అవార్డు అందుకుంది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ డిఫరెంట్ ఫొటో షూట్లతో అభిమానుల్ని అలరిస్తుంటుంది. తాజాగా ప్రియాంక అరుళ్ మోహన్ ఇన్‌‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. రెడ్ కలర్ శారీ కట్టుకుని, జడలో పువ్వులతో దర్శనమిచ్చింది. ఈ క్యూట్ స్మైల్ పిక్స్ పంచుకుంటూ వీటికి ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ‘సాంప్రదాయ దుస్తులలో అందంగా కూర్చుని యువరాణిలా భావిస్తున్నాను’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story