- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Priyamani: స్టైలిష్ అవుట్‌ఫిట్‌తో ఆకట్టుకుంటున్న సీనియర్ బ్యూటీ
ఎంబ్రాయిడరీతో అలంకరించిన వైట్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో మెరిసిపోతున్న ప్రియమణి.

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన పెళ్లైన కొత్తలో చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయం అయింది.
ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం, అలాగే ఇందులో తన నటనతో పాటు అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఆ తర్వాత వరుసగా ఈమెకు టాలీవుడ్‌లో క్రేజీ చిత్రాల్లో అవకాశాలు దక్కాయి. దాంతో కొంతకాలం పాటు ఈ నటి తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్‌గా కొనసాగింది.
అదే సమయంలో ఈమె అనేక ఇతర భాషల చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోల చిత్రాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా, మంచి స్థాయిలోనే తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
మరికొంత కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియమణి హీరోయిన్‌గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమాల్లో ఒకప్పుడు అద్భుతమైన గ్లామర్‌తో యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ నటి, సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల్లో హాట్ మరియు స్టైలిష్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో ఎంబ్రాయిడరీతో అలంకరించిన వైట్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సు ధరించిన ఆమె, చున్నీని కాస్త పైకి వేసుకుని, చేతికి బ్రాస్లెట్ ధరించి, తన జుట్టును ఆకర్షణీయంగా వదిలేసి స్టైలిష్ లుక్‌లో ఫోటోలకు పోజులు ఇచ్చింది.
ప్రస్తుతం ప్రియమణికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






