- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Priyamani: పెళ్లయ్యాక హీరోయిన్లకి అలాంటి పాత్రలు రావు
ప్రియమణి మాట్లాడుతూ... పెళ్లయిన తర్వాత హీరోయిన్లుగా అవకాశాలు తగ్గుతాయి. అక్క, వదిన పాత్రలకు అడుగుతారు, అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదని ఈ నటి చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ బ్యూటీలలో ఒకరైన ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె జగపతిబాబు హీరోగా రూపొందిన పెళ్లైన కొత్తలో అనే చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈ చిత్రం ద్వారా ప్రియమణికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వెంటనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ లాంటి క్రేజీ చిత్రంలో ఈమెకు ఆఫర్ దక్కింది.
ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులో ఈమె టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఈమె తెలుగుతోపాటు అనేక ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితమే ఈ హీరోయిన్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ప్రియమణి చాలా చురుగ్గా సినిమాల్లో నటిస్తోంది. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించి, దర్శకత్వం వహించిన సరస్వతి చిత్రంలో ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మార్చి 6న విడుదల అయింది.
తాజాగా ప్రియమణి 'సరస్వతి' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె పెళ్లయిన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు చాలావరకు తగ్గుతాయి. ఇది అనేకమంది విషయంలో ప్రూవ్ అయింది. అలా ఎందుకు జరుగుతుందో అసలు తెలియదు. పెళ్లి తర్వాత కొంతమంది దర్శకులు వచ్చి అక్క, వదిన పాత్రలు చేయమంటారు, ఎంత అందంగా ఉన్నా కూడా అలాంటి ఆఫర్స్ వస్తుంటాయి అని ప్రియమణి వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.






