ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి.. ఆకట్టుకుంటున్న క్యూట్ లుక్

by Chukka Sudharani |   (  Updated:2025-10-03 14:45:11  IST  )

యంగ్ నటుడు ప్రియదర్శి ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు.

ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి.. ఆకట్టుకుంటున్న క్యూట్ లుక్
X

దిశ, సినిమా: యంగ్ నటుడు ప్రియదర్శి ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ‘ప్రేమంటే’ అనే చిత్రం ప్రకటించాడు. ‘థ్రిల్ ప్రాప్తిరస్తు’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని సునీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో రాబోతున్న ‘ప్రేమంటే’ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పండుగ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. త్వరలో తొలి సింగిల్ రాబోతున్నది అంటూ తెలిపారు. ఈ పోస్టర్‌లో ప్రియదర్శి, ఆనంది ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. Svcllp ప్రజెంట్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్‌పై పుస్కుర రామ్ మోహన్ రావు, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. లింక్

Next Story