Priyadarshi: రాయంచతో రాసలీల నడిరేయివేళ.. ఆకట్టుకుంటోన్న ప్రేమంటే ఫస్ట్ సింగిల్

by Chukka Sudharani |

నటుడు ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రేమంటే’.

Priyadarshi: రాయంచతో రాసలీల నడిరేయివేళ.. ఆకట్టుకుంటోన్న ప్రేమంటే ఫస్ట్ సింగిల్
X

దిశ, సినిమా: నటుడు ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రేమంటే’. ‘థ్రిల్ ప్రాప్తిరస్తు’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని సునీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘దోచావు నన్నే’ రిలీజ్ చేశారు మేకర్స్. ‘రాయంచతో రాసలీల నడిరేయివేళ’ అంటూ సాగే ఈ సాంగ్ మనసుని హత్తుకునే మెలోడీగా కంపోజ్ చేశాడు లియాన్ జేమ్స్.

ప్రజెంట్ ఈ మెలోడీ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నది. ఈ సాంగ్‌ను నేచురల్ స్టార్ నాని తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ‘ఇది సింపుల్.. ఇది వేడిది.. ఇది ప్రేమ.. ప్రేమంటే నుండి దోచావే నన్నే సాంగ్ వచ్చేసింది.. ప్రియమైన దర్శి అండ్ బృందానికి శుభాకాంక్షలు’ అని తెలిపాడు. కాగా.. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్‌గా నటిస్తుంది. Svcllp ప్రజెంట్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్‌పై పుస్కుర రామ్ మోహన్ రావు, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. లింక్

Next Story