Priyadarshi: న్యాయవాది అవతారం ఎత్తిన హీరో.. వైరల్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్

by Ramesh Goud |

కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్-స్టేట్ vs ఎ నోబడీ’.

Priyadarshi: న్యాయవాది అవతారం ఎత్తిన హీరో.. వైరల్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: కొత్త డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్-స్టేట్ vs ఎ నోబడీ’. ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్‌తోనే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. శాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ‘కోర్ట్-స్టేట్ vs ఎ నోబడీ’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో ప్రియదర్శి న్యాయవాదిగా కేసు ఫైల్ పట్టుకుని ఆలోచనలతో కూడిన వ్యక్తిగా కనిపించాడు. హర్ష్ రోషన్, శ్రీదేవి కూడా పోస్టర్‌లో కనిపిస్తున్నారు.

ఇది కథ అంతటా జరిగే ఎమోషన్‌ని చూస్తోంది. ఈ మూడు కీలక పాత్రల చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన డ్రామాని పోస్టర్ ప్రజెంట్ చేసింది. ఇందులో శ్రీ దేవి పేరు జాబిల్లిగా రివిల్ కాగా, హర్ష్ రోషన్ కేసు నంబర్ ద్వారా పరిచయం అయ్యారు. ఈ మూవీ స్టోరీ చట్టపరమైన ఆరోపణలో చిక్కుకున్న అబ్బాయి చుట్టూ తిరుగుతుందని తెలుస్తుండగా.. న్యాయం, సత్యం కోసం పోరాటం చేస్తున్నట్లుగా పోస్టర్‌లో కనపడుతోంది. కాగా.. ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తవుతుండగా, హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Next Story