‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ అప్డేట్ ..థియేటర్లు మార్మోగిపోయేలా నవ్వించడానికి వచ్చేస్తున్నాం అంటూ ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi) ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ అప్డేట్ ..థియేటర్లు మార్మోగిపోయేలా నవ్వించడానికి వచ్చేస్తున్నాం అంటూ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi) ఎన్నో చిత్రాల్లో కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘మల్లేశం’ మూవీతో హీరోగా మారిన ఆయన ‘బలగం’తో ఊహించని రెస్సాన్స్‌కు దక్కించుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. నిత్యం పలు విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ‘35 చిన్న కథ కాదు’ సినిమాతో వచ్చిన ప్రియదర్శి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత నటించిన రెండు చిత్రాలు మెప్పించలేకపోయాయి. ఇక హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రియదర్శి వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘సారంగపాణి జాతకం’(SarangapaniJathakam)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti)దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియదర్శి సరసన రూప కొడువాయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ‘సారంగపాణి జాతకం’ మూవీ విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘సారంగపాణి జాతకం’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 16న సాయంత్రం 6గంటలకు ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా థియేటర్లు మార్మోగిపోయేలా నవ్వించడానికి ఏప్రిల్ 25న మీ ముందుకు వస్తున్నాం.. మీరు కూడా వస్తున్నారా? అనే క్యాప్షన్ జత చేశారు.

Next Story