Niharika: నిహారిక హీరోయిన్‌గా కొత్త సినిమా.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్

by Chukka Sudharani |

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు ప్రియదర్శి (Priyadarshi).

Niharika: నిహారిక హీరోయిన్‌గా కొత్త సినిమా.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు ప్రియదర్శి (Priyadarshi). ఇప్పుడు ఆయన మరో ఎంటర్‌టైన్మెంట్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ సినిమాకు ‘మిత్ర మండలి’ (Mitra Mandali) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇక టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నట్లు తెలిపారు. నిహారిక(Niharika)తో పాటు ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా.. బన్నీ వాస్ నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై మొదటి చిత్రంగా ‘మిత్ర మండలి’ని సమర్పిస్తున్నారు.

Next Story