కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాష్

by Pulgam srinivas |   (  Updated:2026-04-16 16:15:19  IST  )

ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ లుక్స్… వైట్ అండ్ ఎల్లో డ్రెస్‌లో ఆకట్టుకున్న బ్యూటీ

కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాష్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియా ప్రకాష్ వారియర్ 2018లో విడుదలైన 'తనహా' అనే మలయాళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈమెకు 2019లో విడుదలైన 'ఓరు అదార్ లవ్' చిత్రం ద్వారా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది.

ఈ సినిమా ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఈమె 2021లో విడుదలైన 'చెక్' చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ ఫెయిల్యూర్ అయినా కూడా, ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

అదే సంవత్సరం ఈమె తెలుగులో 'ఇష్క్' అనే మరో చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా తర్వాత ఈమె ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఈమె మలయాళ, తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది.

అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ యువ నటి తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్‌లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

అందులో ఈమె వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్‌లో ఉన్న స్లీవ్‌లెస్ డ్రెస్సు ధరించి, మెడలో ఓ భారీ నెక్లెస్ వేసుకుని గడ్డి కట్టలపై స్టైలిష్‌గా చేతులు పెట్టి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈమె తన హాట్ అందాలను ఓలకబోస్తూ కనిపిస్తోంది. దాంతో ఈ పిక్స్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి.

Read More.. ఉబికి వస్తున్న అందాలతో మెస్మరైజ్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

Photos Courtesy: Instagram

Next Story