Prithviraj Sukumaran: ఆర్మీ ఆఫీసర్‌గా స్టార్ హీరో.. ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోన్న ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2025-08-26 05:32:20  IST  )

డైరెక్టర్‌గా, హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సర్‌‌జమీన్’

Prithviraj Sukumaran: ఆర్మీ ఆఫీసర్‌గా స్టార్ హీరో.. ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోన్న ట్రైలర్
X

దిశ, సినిమా: డైరెక్టర్‌గా, హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సర్‌‌జమీన్’ (Sar Zameen). కాయోజ్ ఇరానీ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాజోల్ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఈనెల 25నుంచి జియో హార్ట్ స్టార్‌లో నేరుగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా సర్‌జమీన్ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మీకు తెలుసా.. అక్కడ చాలా గాయాలు ఉన్నాయి.. నువ్వు వాళ్ళని మర్చిపోయే వరకు అది బాధిస్తూనే ఉంటుంది’ అంటూ మంచు కొండల్లో అలీ ఖాన్ ఎంట్రీ ఉంటుంది.. ఇక ‘నాకు నా మాతృభూమి కంటే ఏది ఎక్కువ కాదు.. నా కొడుకు లైఫ్ బలైనా కూడా’ అంటూ ఓ సిన్సియర్ ఆర్మీ ఆఫీసర్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తాడు. నక్సలైట్లు సుకుమారన్ కొడుకును కిడ్నాప్ చేయగా.. వారి నుంచి తన దేశంతో పాటు కొడుకును ఎలా కాపాడుకుంటాడు అనేది స్టోరీ అని తెలుస్తుండగా.. తల్లిగా కాజోల్ ఎమోషనల్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి.

Next Story