SSMB29 షూటింగ్‌లో స్టార్ హీరో.. వైరల్‌గా మారిన వీడియో

by Chukka Sudharani |

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

SSMB29 షూటింగ్‌లో స్టార్ హీరో.. వైరల్‌గా మారిన వీడియో
X

దిశ, సినిమా: మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ చిత్రీకరణలో తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ భాగం అయ్యారు. అంతేకాకుండా.. ఆయన రీసెంట్‌గా హైదరాబాద్‌కు వచ్చిన విజువల్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్న ‘SSMB29’లో కేవలం కొత్త వాళ్లను మాత్రమే తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. వాళ్లు కూడా సెట్ అయితే త్వరలో కెనడా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్ల సమాచారం. లింక్

Next Story