ప్రిన్స్ మహేశ్ బర్త్ డే స్పెషల్.. SSMB29 ప్రీ లుక్ ఫొటో రివీల్ చేసిన రాజమౌళి

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-09 06:31:56  IST  )

మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినెషన్‌లో వస్తున్న SSMB-29 మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ప్రిన్స్ మహేశ్ బర్త్ డే స్పెషల్.. SSMB29 ప్రీ లుక్ ఫొటో రివీల్ చేసిన రాజమౌళి
X

దిశ, వెబ్‌డెస్క్: మహేశ్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినెషన్‌లో వస్తున్న SSMB-29 మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహేశ్ ఫ్యాన్స్ మూవీ అప్‌డేట్ కోసం చొక్కాలు చించుకుంటున్నా.. రాజామౌళి మాత్రం మూవీకి సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా వదలడం లేదని ఫైర్ అవుతున్నారు. అయితే, ఇవాళ ప్రిన్స్ మహేశ్ బాబు జన్మదినం సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా SSMB-29పై సంచలన ట్వీట్ చేశారు.

ఈ మేరకు ఆయన మూవీలోని మహేశ్ ప్రీ లుక్‌ ఇన్‌డెప్త్ ఫొటోను #GLOBETROTTER షేర్ చేశారు. అదేవిధంగా టోటల్ లుక్‌ను నవంబర్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. రాజమౌళి చేసిన ట్వీట్‌లో ‘ప్రియమైన సినిమా లవర్స్, భారత్, ప్రపంచవ్యాప్తంగా, మహేష్ అభిమానులకు SSMB-29 షూటింగ్ ప్రారంభించి చాలా కాలం అయిందని తెలియజేస్తున్నా. ఈ చిత్రంలో కథ, విస్తృత దృశ్యాలు అంతటి విశాలంగా ఉన్నాయి. అందుకే నేను ఫోటోలు తీసి పత్రికా సమావేశాలు నిర్వహిస్తే స్టోరీకి న్యాయం చేయలేనని భావిస్తున్నా. ప్రస్తుతానికి ఓ ఫొటోను విడుదల చేశాం. మహేశ్ బాబును గతంలో ఎన్నడూ చూడని విధంగా SSMB-29లో మహేశ్ బాబును చూస్తారు. నవంబర్ 2025లో మూవీకి సంబంధించి ప్రిన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. ఏ నెవర్-బిఫోర్-రివీల్ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. అయితే, రాజమౌళి ‘X’ వేదికగా రివీల్ చేసిన మహేశ్ ఇన్‌డెప్త్ పిక్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.

Next Story