HHVM: పవన్ కల్యాణ్ సినిమాలో ప్రధాని మోడీ డైలాగ్.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-25 06:29:08  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రమైన హరిహర వీరమల్లు(Harihara Veeramallu Movie) ట్రైలర్ వచ్చేసింది.

HHVM: పవన్ కల్యాణ్ సినిమాలో ప్రధాని మోడీ డైలాగ్.. సోషల్ మీడియాను కుదిపేస్తున్న వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రమైన హరిహర వీరమల్లు(Harihara Veeramallu Movie) ట్రైలర్ వచ్చేసింది. అనుకున్న సమయానికి సరిగ్గా 11:10 నిమిషాలకు విడుదల చేశారు. హిందువులపై ఔరంగజేబు చేస్తున్న దాడిని వివరిస్తూ ప్రారంభమైన ట్రైవర్.. వారిని కాపాడే వీరుడి ఎంట్రీతో మరో లెవెల్‌కు వెళ్లింది. అంతేగాకుండా.. విలన్‌తో ఫైట్‌ సీన్‌లో ఆంది ఆగయా అనే డైలాగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవల ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌ను ప్రధాని మోడీ(PM Modi) ‘పవన్ నహీ.. ఆందీ హై’ అని మాట్లాడిన విషయం తెలిసిందే. అదే డైలాగ్‌ను సినిమాలో వాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవర్‌ఫుల్‌ వీరమల్లుగా యోధుడి పాత్రలో తన డైలాగులతో పవన్‌ ఆకట్టుకుంటున్నారు. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ కనిపించనున్నారు. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ను అందరినీ ఆకట్టుకుటుందని మేకర్స్ ప్రకటించారు.

Link


Read More..

వీరమల్లు’ విధ్వంసం.. అదిరిపోయిన ట్రైలర్.. కామెంట్లతో రెచ్చిపోతున్న ఫ్యాన్స్

Next Story