boyycottlaila : ట్రోలర్స్ కు పృధ్వీ భార్య మాస్ వార్నింగ్

by Muthe.Rajitha |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishvaksen) "లైలా"(Laila) చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే.

boyycottlaila : ట్రోలర్స్ కు పృధ్వీ భార్య మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishvaksen) "లైలా"(Laila) చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృధ్వీరాజ్(Actor Prudhviraj) చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దూమరాన్ని రేపాయి. పృధ్వీ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీని ఉద్దేశించే అని వైసీపీ(YCP) వర్గీయులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ లైలా(boycottliala) అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా ఫిబ్రవరి 14న విడుదల అవనున్న ఈ సినిమా HD ప్రింట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై విశ్వక్ సేన్, నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ అడిగిన తర్వాత కూడా ట్రోలింగ్ ఆగలేదు. ఇక నటుడు పృధ్వీకి అసంఖ్యాక బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ఈ వ్యవహారంపై నటుడు పృధ్వీ భార్య(Prudhviraj wife) ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తాము ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలని, ఎక్కడో దాక్కొని పోస్టులు పెట్టడం కాదని సవాల్ విసిరింది. తన భర్త సినిమాలో ఇచ్చిన సీన్లో ఉన్న గొర్రెల గురించి మాట్లాడారే తప్ప రాజకీయంగా మాట్లాడలేదన్నారు. గొర్రెలకు కోపం రావాలి కానీ మనుషులకు ఎందుకు వస్తోందని మండిపడ్డారు. డైరెక్టర్ ఏది చెబితే అది ఒక కామెడీ ఆర్టిస్ట్ గా చేశాడు, స్టేజి మీద ఫన్నీ వేలో చెప్పాడు తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు.

అయితే సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ గతంలో వైసీపీ(YCP)కి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేన(Janasena)కు దగ్గరైన పృథ్వీరాజ్ మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు. ఇక ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్ లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న ఆయన తాజాగా లైలా ఈవెంట్లో వైసీపీ నేతలను మేకలతో పోలుస్తూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు.

Next Story