- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాకు ప్రతిష్టాత్మక అవార్డ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం చిత్రానికి(Rangasthalam Movie) అరుదైన గౌరవం లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం చిత్రానికి(Rangasthalam Movie) అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రతిష్టాత్మకంగా ప్రకటిస్తోన్న గద్దర్ సినీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ తెలిపారు. శుక్రవారం నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజుతో కలిసి మురళీమోహన్ గద్దర్ అవార్డులకు ఎంపికైన చిత్రాల వివరాలను మీడియాకు వెళ్లడించారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. 2014 నుండి 2023 వరకు ఏడాదికి ఒకటి చొప్పున ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు.
2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి ఏడాది మూడు సినిమాలకు అవార్డులను ప్రకటించారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు ప్రకటించారు. 2018లో విడుదలైన రెండో ఉత్తమ చిత్రంగా రంగస్థలాన్ని ఎంపిక చేశారు. మొదటి ఉత్తమ చిత్రంగా కీర్తి సురేష్ నటించిన మహానటికి అందించారు. మూడో ఉత్తమ చిత్రంగా కేరాఫ్ కంచరపాలెంను ఎంపిక చేశారు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రంగస్థలం సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు. 2018లో రంగస్థలం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.






