- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sai Dharam Tej: మెగాస్టార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. సాయి ధరమ్ తేజ్ రియాక్షన్ ఇదే (ట్వీట్)
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే 9ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు సొంతం చేసుకుని అందరి మనసులు గెలుచుకున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆయన పద్మ విభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా, చిరంజీవి ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని మెగాస్టార్‌కు అందించింది. ప్రస్తుతం ఇదే వార్తలు, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతుండటంతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే చిరుకి అవార్డు రావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) చిరంజీవిపై ఓ ట్వీట్ చేశాడు. ‘‘మరో రోజు - నా పద్మ విభూషణ్ మెగాస్టార్ కి మరో అవార్డు. నా ప్రియమైన పెద మామకు అభినందనలు. లండన్‌లోని UK పార్లమెంట్‌లో బ్రిటిష్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన "జీవిత సాఫల్య పురస్కారం" అందుకున్న మొదటి భారతీయ సెలబ్రిటీగా అవతరించినందుకు కంగ్రాట్స్! ఇది నాకు, తెలుగు సినిమాకు నిజంగా గర్వకారణమైన క్షణాలలో ఒకటి. పెద మామ, మీ అద్భుతమైన కృషి, అంకితభావం, అవిశ్రాంత ప్రయత్నాలతో మమ్మల్ని నిరంతరం ప్రేరేపించినందుకు, నిరంతరం చరిత్ర సృష్టింస్తునందుకు ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు.
అలాగే చిరు అవార్డు అందుకుంటున్న ఫొటోలను కూడా షేర్ చేశాడు. కాగా, మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. చిరు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఇందులో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికీ మెగాస్టార్ వరుస మూవీస్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.
READ MORE ...
ఆయన నాకు అన్యయ్యే కాదు..! చిరంజీవి యూకే పార్లమెంట్ అవార్డ్ అందుకోవడంపై పవన్ కళ్యాణ్






