- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడి కాళ్లు మొక్కిన రాష్ట్రపతి
చిత్తూరు నాగయ్య.. నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడుగా సినిమా రంగానికి ఎన్నో సేవలు అందించాడు. అంతకు ముందు బడిపంతులుగా, విలేఖరిగా ఉద్యోగం చేసిన ఆయన.. 1938లో గృహలక్ష్మి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. తెలుగు, తమిళం, కన్నడతో

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు నాగయ్య.. నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడుగా సినిమా రంగానికి ఎన్నో సేవలు అందించాడు. అంతకు ముందు బడిపంతులుగా, విలేఖరిగా ఉద్యోగం చేసిన ఆయన.. 1938లో గృహలక్ష్మి సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు. తెలుగు, తమిళం, కన్నడతో కలిపి దాదాపు 340 చిత్రాల్లో నటించాడు. ఆ తర్ాత రేణుకా ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా మారాడు. పోతన, వేమన, త్యాగయ్య, రామదాసు పాత్రలకు భారీ గుర్తింపు రాగా.. ఆయన కళామతల్లి చేసిన సేవలకుగాను దక్షిణ భారతదేశంలో తొలి పద్మశ్రీ అవార్డు అందుకున్న నటుడిగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో పద్మశ్రీ అందించే సమయంలో 1965లో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వయంగా ఆయన పాదాలకు నమస్కరించారట. ఇక త్యాగయ్య సినిమా చూసిన మైసూరు మహారాజా.. ఈ మహానుభావుడిని బంగారు నాణేలు, కంఠాభరణంతో సత్కరించారట. కానీ ఎంతో గొప్ప జీవితాన్ని చూసిన ఆయన.. మూత్రపిండాల వ్యాధితో 1973లో మరణించారు. చివరి రోజుల్లో డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు చేశారు.






