PREGNANCY GLOW : బేబీ బంప్‌తో కనిపించిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ఎంత క్యూట్‌గా ఉందో..

by Sujitha Rachapalli |

మెగా కోడలు లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులకు ఇప్పటికే గుడ్ న్యూస్ చెప్పేసింది. త్వరలో బిడ్డకు వెల్ కమ్ చెప్పబోతున్నట్లు ప్రకటించేసింది. దీంతో అందరూ హ్యాపీగా ఉండగా.. ఆమెను మానసికంగా ఉల్లాసంగా ఉంచేందుకు

PREGNANCY GLOW : బేబీ బంప్‌తో కనిపించిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ఎంత క్యూట్‌గా ఉందో..
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా కోడలు లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీతోపాటు అభిమానులకు ఇప్పటికే గుడ్ న్యూస్ చెప్పేసింది. త్వరలో బిడ్డకు వెల్ కమ్ చెప్పబోతున్నట్లు ప్రకటించేసింది. దీంతో అందరూ హ్యాపీగా ఉండగా.. ఆమెను మానసికంగా ఉల్లాసంగా ఉంచేందుకు, హ్యాపీగా గడిపేందుకు భర్త వరుణ్ తేజ్ దగ్గరుండి వెకేషన్స్‌కు తీసుకెళ్తున్నాడు. జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అన్నీ తీరుస్తున్నాడు. తనకు కావాల్సిన ఫుడ్ సమకూరుస్తున్నారు. కాఫీ నుంచి మ్యాంగో వరకు అడిగినవన్నీ.. అడిగిన చోట ఇప్పిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఓ వెకేషన్‌కు వెళ్లి తిరిగొస్తున్న వరుణ్, లావణ్య.. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించారు. పింక్ కలర్ కంఫర్టబుల్ డ్రెస్‌లో ఉన్న లావణ్య.. ముద్దుగా, సూపర్ క్యూట్‌గా కనిపించింది. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కాగా ఎలాంటి దిష్టి తాకకూడదని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఆరోగ్యంగా బిడ్డను కనాలని.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.

Next Story