- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ కంప్లీట్ చేసుకున్న పాపం 'ప్రతాప్-తిమ్మరాజుపల్లి టీవీ'.
పాపం ప్రతాప్, తిమ్మరాజుపల్లి టీవీ — ఈ రెండు సినిమాలకు కూడా సెన్సార్ బోర్డు నుండి 'U/A' సర్టిఫికెట్ వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: రేపు తిరువీర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పాపం ప్రతాప్' చిత్రంతో పాటు కిరణ్ అబ్బవరం నిర్మాణంలో రూపొందిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా కూడా విడుదల కానుంది. సాధారణంగా సినిమాల విడుదలకు రెండు, మూడు రోజుల ముందే సెన్సార్ కార్యక్రమాలను మూవీ బృందాలు పూర్తి చేసుకుంటాయి. దాంతో ప్రీమియర్ షోలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ రెండు సినిమాలకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. దాంతో 'పాపం ప్రతాప్' చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోల విషయంలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్ర నిర్మాత అయిన కిరణ్ అబ్బవరం ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ ఇప్పుడే పూర్తయ్యిందని, అందుకే ప్రీమియర్ షోలను ప్రదర్శించలేకపోయామని వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఈ రెండు చిత్రాలకు సంబంధించిన సెన్సార్ రిపోర్టులు తాజాగా బయటకు వచ్చాయి. మరి ఈ రెండు చిత్రాలకు సెన్సార్ బోర్డు నుండి ఎలాంటి సర్టిఫికెట్ జారీ అయింది? ఈ సినిమాలు ఎంత రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాపం ప్రతాప్: ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తిమ్మరాజుపల్లి టీవీ: ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా 2 గంటల 04 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించనుంది.
ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాలను అందుకుంటాయో చూడాలి.






