Prashanth Verma: సంవత్సరం పూర్తి చేసుకున్న హనుమాన్.. ప్రశాంత్ వర్మ స్పెషల్ పోస్ట్

by Chukka Sudharani |

యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), టాలెంటెట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’

Prashanth Verma: సంవత్సరం పూర్తి చేసుకున్న హనుమాన్.. ప్రశాంత్ వర్మ స్పెషల్ పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), టాలెంటెట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) కాంబినేషన్‌లో వచ్చిన ‘హనుమాన్’ (Hanuman). గతేడాది ఇదే టైమ్‌లో అంటే సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ (Blockbuster) హిట్ అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమాతో పాటు వచ్చిన పెద్ద, పెద్ద చిత్రాలను సైతం పక్కకు తోసేసి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ‘హనుమాన్’ చిత్రంతో హీరో తేజా సజ్జాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ హనుమాన్‌కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ (Jai Hanuman) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. పార్ట్-1 హనుమాన్ వచ్చి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా డైరెక్టర్ ఓ ఎమోషనల్ ట్వీట్ (emotional tweet) పెట్టాడు. ‘నా హృదయానికి ఎంతో దగ్గరైన హనుమాన్ చిత్రం సంవత్సరం పూర్తి చేసుకుంది. అంతే కాదు ఇప్పుడు ఇది నాలో శాశ్వత భాగంగా మారిపోయింది. "బలానికి ప్రతీక", ఓర్పు అండ్ నమ్మకం, విశ్వాసంతో పాటు స్థిరంగా ఉండటానికి నిశ్శబ్ద రిమైండర్‌గా మారిపోయింది’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రజెంట్ ఇది వైరల్‌గా మారడంతో జై హనుమాన్ అప్‌డేట్ ఇవ్వాలంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Next Story