- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లీజ్ ఎక్స్ ట్రా టీషర్ట్ తెచ్చుకోండి.. ఓజీ ప్రేక్షకులకు ప్రసాద్ ఐమాక్స్ రిక్వెస్ట్
ఓజీ సినిమాకు వచ్చే పవన్ కల్యాణ్ అభిమానులు ఎక్స్ ట్రా టీషర్ట్ తెచ్చుకోవాలి అంటూ హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టిప్లెక్స్ థియేటర్ యాజమాన్యం కోరింది.

దిశ, వెబ్ డెస్క్: ఓజీ సినిమాకు వచ్చే పవన్ కల్యాణ్ అభిమానులు ఎక్స్ ట్రా టీషర్ట్ తెచ్చుకోవాలి అంటూ హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టిప్లెక్స్ థియేటర్ యాజమాన్యం కోరింది. సినిమాలను ఉత్సవంలా జరుపుకునే క్రమంలో అరుపులు కేకలు, చప్పట్లు కొట్టడం, డ్యాన్సులు చేస్తామని కానీ ఓజీ సినిమాతో అభిమానుల ఉత్సాహం సాధారణ స్థాయిని దాటిపోయిందని పేర్కొంది.
అభిమానులు తమ టీ షర్టులను చింపుకుంటున్నారని గమనించినట్టు తెలిపింది. ఆ ఉత్సాహాన్ని తాము సైతం అర్థం చేసుకుంటామని, సినిమాకు వచ్చేటప్పుడు ముందు జాగ్రత్తగా అదనంగా మరో టీషర్ట్ వెంట తెచ్చుకోవాలని సూచించింది. ఎప్పటిలానే ప్రసాద్ ఐమాక్స్ అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందని, కానీ దుస్తులను మాత్రం ఇవ్వలేమని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా, సినిమాకు మరింత హైప్ పెంచేందుకు థియేటర్ యాజమాన్యం ఈ ట్వీట్ చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.






