కేన్స్ రెడ్ కార్పెట్‌పై పవన్ కళ్యాణ్ బ్యూటీ.. చీరలో మెస్మరైజ్ చేసిన తెలుగు హీరోయిన్... కళ్లు తిప్పుకోలేని అందంతో మతిపోగొడుతున్న భామ.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-23 12:23:34  IST  )

బొంగరాలంటి కళ్లు తిప్పింది... ఉంగరాలున్న జుట్టు తిప్పింది... గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ... అమ్మో బాపు గారి బొమ్మో... ఓలమ్మో మల్లెపూల కొమ్మో...’.. అత్తారింటికి దారేదీ సినిమాలో

కేన్స్ రెడ్ కార్పెట్‌పై పవన్ కళ్యాణ్ బ్యూటీ.. చీరలో మెస్మరైజ్ చేసిన తెలుగు హీరోయిన్...  కళ్లు తిప్పుకోలేని అందంతో మతిపోగొడుతున్న భామ.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : ‘బొంగరాలంటి కళ్లు తిప్పింది... ఉంగరాలున్న జుట్టు తిప్పింది... గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ... అమ్మో బాపు గారి బొమ్మో... ఓలమ్మో మల్లెపూల కొమ్మో...’.. అత్తారింటికి దారేదీ సినిమాలో ప్రణితా సుభాష్ గురించి రాసిన లిరిక్స్ ఇవి. అప్పుడు ఎందుకు రాశారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం యాప్టెడ్ అనిపిస్తుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ బ్యూటీ ఇచ్చిన అప్పియరెన్స్ అలాంటిది మరి. అవును.. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ప్రణిత.. అందంలో మాత్రం ఇంటర్నేషనల్ సెలబ్రిటీలతో పోటీ పడుతోంది.

కేన్స్ ఫస్ట్ లుక్‌లో భాగంగా చీర ధరించి రెడ్ కార్పెట్‌పై మెరిసిన ఆమెను చూసి కళ్లు తిప్పుకోలేకపోయారు జనాలు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా తన బ్యూటీపై ప్రశంసల వర్షం కురవడమే కాదు శారీ లుక్‌ను ఎంచుకోవడాన్ని కొనియాడుతున్నారు. తనను చూస్తుంటే అందానికి అసూయ పుట్టదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిమానులైతే ఆనందంలో మునిగితేలుతున్నారు. ఆమె ఎక్కడకు వెళ్లినా ఒక ఆరా ఉంటుందని.. చాలా పీస్‌ఫుల్‌ అట్మాస్పియర్ క్రియేట్ చేయగలదని మురిసిపోతున్నారు.

Next Story