Praneeta: అవకాశాలు లేకపోయినా అలా అలరిస్తున్న ప్రణీత

by Pulgam srinivas |

సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తున్న ప్రణీత

Praneeta: అవకాశాలు లేకపోయినా అలా అలరిస్తున్న ప్రణీత
X

దిశ, వెబ్ డెస్క్: బ్యూటిఫుల్ నటి ప్రణీత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రభస, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రాల్లో ఈమె రెండవ హీరోయిన్గా నటించింది.




ఇందులో రభస సినిమా ఫెయిల్యూర్ కాగా, అత్తారింటికి దారేది బ్లాక్ బాస్టర్ అయింది. ఈ రెండు చిత్రాల ద్వారా ప్రణీతకి మంచి గుర్తింపు వచ్చింది. చాలా కాలం పాటు తెలుగు సినిమాల్లో నటించినా కూడా ఈ బ్యూటీ కెరీర్ను పీక్ స్టేజ్ లో సాగించలేదు.




కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఈమె అనేక ఇతర భాషల సినిమాల్లో కూడా నటించింది. సినిమా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టిన సమయంలో ప్రణీత వివాహం చేసుకుంది.




ప్రస్తుతం ప్రణీత పెద్దగా సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి.




తాజాగా ఈ సీనియర్ నటి తన 'ఇన్ స్టా'లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె బ్లాక్ కలర్ సారీని డిఫరెంట్ లుక్ లో కట్టుకొని, కిల్లింగ్ లుక్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.




బ్లాక్ కలర్ చీరలో ఈ బ్యూటీ చాలా అందంగా ఉండడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకి చాలా మంది వావ్, గార్జియస్, సో క్యూట్, లవ్, ఫైర్ ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.

Next Story