- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Praneetha Subhash: వైట్ డ్రెస్సులో క్లాస్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తున్న సీనియర్ హీరోయిన్
ఇయర్ రింగ్స్‌తో స్పెషల్ లుక్.. ప్రణీత అందం మరింత హైలెట్.

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ ప్రణీత సుభాష్ 1992 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే కాగా, వారికి ప్రణీత ఏకైక కుమార్తె. ప్రణీత తన పాఠశాల విద్యను బెంగళూరులోని ఆర్యన్ ప్రెసిడెన్సీ పాఠశాలలో పూర్తి చేసింది. అనంతరం బెంగళూరు విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువును ప్రారంభించింది.
అయితే మోడలింగ్ మరియు సినిమా రంగాలపై ఆసక్తి పెరగడంతో ఆమె తన చదువును మధ్యలోనే నిలిపివేసింది. మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు పొందిన తర్వాత ప్రణీత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2010లో విడుదలైన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా పెద్దగా గుర్తింపు రాకపోయినా, అదే సంవత్సరం విడుదలైన ‘బావ’ చిత్రం ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.
అనంతరం పలు చిత్రాలలో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువగా సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇటీవల ఈ సీనియర్ హీరోయిన్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలను షేర్ చేసింది.
తెలుపు రంగు డ్రెస్ ధరించి, చేతికి వాచ్ పెట్టుకుని స్టైలిష్‌గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. ముఖ్యంగా ఆమె చెవులకు ధరించిన ఇయర్ రింగ్స్ ఆమె అందాన్ని మరింతగా హైలెట్ చేశాయి. వైట్ డ్రెస్‌లో ప్రణీత ఎంతో క్యూట్‌గా కనిపించడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






