నా ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరు: ప్రకాష్ రాజ్

by Ajay Maddhiboyina |

త‌న ప్ర‌శ్నించే గొంతును ఎవ‌రూ ఆప‌లేర‌ని న‌టుడు ప్ర‌కాష్ రాజ్ అన్నారు. తాను మౌనంగా లేన‌ని అన్నీ చూస్తున్నాన‌ని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి ఇన్ఫ్లుయెన్స్ తో జ‌న‌సైనికులు, కొంద‌రికి అమ్ముడుపోయిన జ‌న‌సైనికులు యూట్యూబ‌ర్లు చేస్తున్న అస‌త్య‌ప్ర‌చారాలు వింటున్నాన‌ని అన్నారు.

నా ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరు: ప్రకాష్ రాజ్
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌న ప్ర‌శ్నించే గొంతును ఎవ‌రూ ఆప‌లేర‌ని న‌టుడు ప్ర‌కాష్ రాజ్ అన్నారు. తాను మౌనంగా లేన‌ని అన్నీ చూస్తున్నాన‌ని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి ఇన్ఫ్లుయెన్స్ తో జ‌న‌సైనికులు, కొంద‌రికి అమ్ముడుపోయిన జ‌న‌సైనికులు యూట్యూబ‌ర్లు చేస్తున్న అస‌త్య‌ప్ర‌చారాలు వింటున్నాన‌ని అన్నారు. మీ అంద‌రికీ నా స‌మాధానం ఇదేన‌ని.. దిగ‌జారండి.. ఇంకా దిగ‌జారండి అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌పంచం మొత్తం చూస్తుంద‌ని, దిగ‌జార‌డంలో మీకు మీరే సాటి అని చెప్పేలా దిగ‌జారండి అంటూ మండిప‌డ్డారు.

కాస్త గ‌ట్టిగా దిగ‌జ‌రండి.. అరుస్తూ దిగ‌జారండి అంటూ మండిప‌డ్డారు. మీరు ఎంత అరిచినా ఎన్ని క‌థ‌లు చెప్పినా త‌న లాంటి ప్ర‌శ్నించే గొంతుల‌ను ఆప‌లేచ‌ని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ గతకొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రశ్న రావణ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన నాటి నుండి ప్రకాష్ రాజ్ ఆయనకు మద్దతుగా నిలుస్తూ వీడియోలు చేస్తున్నారు. రావణ్‌ను అక్రమ అరెస్ట్ చేశారంటూ ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ పై సైతం కొందరు విమర్శలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు.

Next Story